INDO EUROSKY

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. చందానగర్‌లో సెల్లార్లు, ఇండ్లలోకి చేరిన వరదనీరు

 ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్‌ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. 

సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీరు వెళ్లేందుకు కాలువలు లేకపోవడం వల్లే ఇలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభానికే పరిస్థితులు ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Scroll to Top